జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారు. కశ్మీర్ లోని బుద్గాం జిల్లా చదూరా ప్రాంతంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వారిని వెంటనే స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. అయితే అందులో ఒకరు చనిపోయారు.